IPL 2024:గుజరాత్,పాండ్యను లైట్ తీసుకుందా?

55
- Advertisement -

2024 ఐపీఎల్ సీజన్ లో అత్యంత చర్చనీయాంశం ఏదైనా ఉందా అంటే అది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించి ఆ బాధ్యతలు హర్ధిక్ పాండ్య కు అప్పగించడమే. ముంబై ఇండియన్స్ కు ఏకంగా 4 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ ను పక్కన పెట్టి పాండ్యను కెప్టెన్ గా నియమించడంపై చాలానే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే అంతకు ముందు గుజరాత్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పాండ్య.. సడన్ గా ముంబై ఇండియన్స్ లోకి వెళ్ళడంపై గుజరాత్ ఎందుకు సైలెంట్ గా ఉందనే డౌట్ మొదటి నుంచి అందరి లోనూ ఉంది. దీనిపై తాజాగా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా స్పందించారు. హర్ధిక్ పాండ్యా ముంబై జట్టులోకి వెళ్లడాన్ని తను అడ్డు చెప్పలేదని నెహ్రా చెప్పుకొచ్చాడు. గతంలో అతడు ముంబై జట్టుకు ఆడిన కారణంగా అడ్డు చెప్పలేదని, వేరే జట్టులోకి వెళ్ళి ఉంటే కచ్చితంగా ఆపేవాడని అంటూ నెహ్రా వ్యాఖ్యానించాడు..

అయితే గుజరాత్ టైటైన్స్ హర్ధిక్ పాండ్యను కచ్చితంగా మిస్ అవుతుందని, పాండ్య లేకపోయిన తమ జట్టు పటిష్టంగానే ఉందని నెహ్రా చెప్పుకొచ్చారు. ఇక పాండ్య ముంబై ఇండియన్స్ లోకి వెళ్ళగానే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ యంగ్ సెన్సేషన్ శుబ్ మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించింది యజమాన్యం. గిల్ పై ఉన్న నమ్మకం కారణంగానే పాండ్యను గుజరాత్ లైట్ తీసుకున్నట్లు క్రీడా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మొదటి సారి కెప్టెన్సీ బాద్యతలు చేపడుతున్న గిల్ ఎంతవరకు రాణిస్తాడనే దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 24 న గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మరి ఈ సీజన్ ప్రారంభానికి ముందే తరచూ వార్తల్లో నిలిచిన ఈ రెండు జట్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాయో చూడాలి.

Also Read:పవన్, లోకేష్ లతో మహిళలు ఢీ!

- Advertisement -