జీఎస్టీ ధరలు తగ్గనున్నాయా?

7
- Advertisement -

ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా..? జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించనుందా అంటే..కేంద్రవర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. 12శాతం శ్లాబులోని వస్తువులను 5శాతం శ్లాబులోకి తీసుకొస్తే మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

ప్రస్తుతం 12శాతం శ్లాబ్ విధానంలో టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు యంత్రాలు, ప్రెజర్ కుక్కర్, గీజర్, అల్యూమినియం, స్టీల్ తో తయారైన వంట పాత్రలు, వాషింగ్ మెషీన్లు (తక్కువ సామర్థ్యం ఉన్నవి), ఎలక్ట్రానిక్ ఇస్త్రీపెట్టె, సైకిళ్లు, నీటి ఫిల్టర్లు, శుద్ది యంత్రాలు (విద్యుత్ అవసరం లేనివి), సోలార్ వాటర్ హీటర్ లు, వాక్యూమ్ క్లీనర్లు ఉన్నాయి.

అలాగే వెయ్యికిపైగా ధర ఉన్న రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుంచి రూ. వెయ్యి మధ్య ధర ఉండే పాదరక్షలు, స్టేషనరీ ఉత్పత్తులు, పలు రకాల టీకాలు, కొన్ని రకాల వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. వీటిని 5 శాతం శ్లాబులోకి తీసుకొస్తే ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే మధ్య తరగతి ప్రజలకు ఇది నిజంగానే గుడ్‌న్యూస్.

Also Read:ఒకే జిల్లా…గుండెపోటుతో 23 మంది మృతి

- Advertisement -