నేటి రోజుల్లో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలమంది ఈ చక్కెర వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి, మనం తినే ఆహారపు అలవాట్లు ఒక కారణం అయితే శారీరక శ్రమ లేకపోవడం మరో కారణం. అందుకే ప్రతిరోజూ వ్యాయామానికి తగిన సమయం కేటాయిస్తూ తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి బారిన పడితే దీని నుంచి బయటపడడం అంతా తేలికైన విషయం కాదు ఎన్ని రకాల మెడిసన్స్ తీసుకున్న ఎన్ని ప్రయత్నాలు చేసిన షుగర్ వ్యాధి కంట్రోల్ లోకి రావడం చాలా కష్టం. .
అందుకే ఈ వ్యాధి రాక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే షుగర్ వ్యాధిని తగ్గించడంలో పచ్చిమిచ్చి ఎంతగానో ఉపయోగ పడుతుందట. పచ్చిమిర్చి,లో ఉండే క్యాప్సైసిన్ అనే మూలకం షుగర్ వ్యాధిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందట. అందుకే షుగర్ వ్యాధి గ్రస్తులు వారు తినే ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి మెటబాలిజన్ని పెంపొందించే గుణాలు ఎక్కువ అందుకే బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా పచ్చిమిర్చిని ఆహార పట్టికలో చేర్చుకోవాలి. అధిక బరువు కూడా మధుమేహానికి దారి తీస్తుంది కాబట్టి బరువును తగ్గించడంలో పచ్చిమిర్చి చక్కగా ఉపయోగ పడుతుంది. ఇంకా ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే మూలకం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి సజావుగా జరిగేలా చూస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా పచ్చిమిర్చిని ఆహార డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నా మాట.
Also Read:ఉరుకు పటేల…లిరికల్ సాంగ్