చరణ్ – వరుణ్.. ఏదో జరిగింది?

20
- Advertisement -

రామ్ చరణ్ – వరుణ్ తేజ్ ఇద్దరూ మెగా సోదరులు. విపరీతమైన అనుబంధం వుంది. రామ్ చరణ్ మాట మీదే వరుణ్ తేజ్ కూడా కట్టుబడి ఉండే వాడు. చరణ్ కూడా వరుణ్ తేజ్ ను బాగా ఎంకరేజ్ చేశాడు. చరణ్ మాటే.. తన బాట అన్నట్లు వరుణ్ వెళ్ళేవాడు. కానీ, ఇప్పుడు ఇద్దరి మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి ఎందుకు, ఎలా, విషయం ఏమిటి అన్నది క్లారిటీ లేదు కానీ, రామ్ చరణ్ – వరుణ్ తేజ్ మధ్య మాత్రం సమ్ థింగ్.. సమ్ థింగ్… అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా వస్తోంది అనగానే.. ఆ సినిమా ప్రీ రిలీజ్ కు రామ్ చరణ్ పక్కాగా వస్తున్నారని వార్తలు వినిపించాయి. మెగా ఫ్యాన్స్ కూడా నిజమే అని అంచనా వేశారు. కానీ, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా విడుదల అయింది. ప్లాప్ కూడా అయ్యింది. చరణ్ మాత్రం ఈ సినిమాకి ఎక్కడా తన సపోర్ట్ అందించలేదు. అసలు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ వుంటుందని తెలిసే చరణ్ అప్పుడు కావాలని టూర్ పెట్టుకున్నారనే వార్తలు వినిపించాయి.

అలాగే, తమకు కావాల్సిన వాళ్ల సినిమా, నచ్చిన వాళ్లు విషయం అంటే ఓ ట్వీట్ వేయడం అన్నది మెగా కాపౌండ్ లో చాలా కామన్. ఆపరేషన్ వాలెంటైన్ కి మాత్రం అది జరగలేదు. రామ్ చరణ్ – వరుణ్ తేజ్ మధ్య గ్యాప్ రావడానికి వరుణ్ తేజ్ పెళ్ళిలో జరిగిన ఓ సంఘటన అని టాక్ నడుస్తోంది. ఎక్కడో చరణ్ బాగా ఫీల్ అయ్యాడు అని, అప్పటినుంచి రామ్ చరణ్, వరుణ్ తేజ్ ను దూరం పెడుతూ వస్తున్నాడు అని టాక్, మరి ఈ గ్యాసిప్ ల్లో నిజమెంతో మరి వారిద్దరికే తెలియాలి. లేదా వారి సన్నిహితులకు తెలియాలి.

Also Read:పిక్ టాక్ : ఘాటు ఫోజులతో రచ్చ రచ్చ

- Advertisement -