సారా అలీ ఖాన్ ఎప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్ లు చేస్తూ ఉంటుంది. సహజంగానే ఈ టైపు ఫోటో షూట్లకు ఇన్ స్టాగ్రామ్ వేదిక అయింది. చాలామంది హీరోయిన్లు ప్రతిరోజూ ఎదో ఒక ఫోటో షేర్ చేస్తున్నారు. ఇక సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే వంటి హీరోయిన్లు వారానికి రెండు, మూడు ఫొటోషూట్లు చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెడుతున్నారు. వీరికి ఫాలోవర్స్ పెరుగుతున్నది కూడా ఈ ఫోటోల వల్లె. వీరి క్రేజ్ పెరుగుతున్నకొద్దీ బట్టల సైజ్ తగ్గుతోంది. సారా అలీ ఖాన్ కూడా ఈ మధ్య తరచుగా పొట్టి గౌన్లు వేసుకొని తన కాళ్ళు చూపిస్తోంది. అలాగే లో నెక్ డ్రెస్సులు ధరించి హీట్ పెంచుతోంది.
తాజాగా పెట్టిన ఫోటోలను చూసి సారా అలీ ఖాన్ అభిమానులు పలువురు “అక్కా సైకిల్ తొక్కిన సమయంలో అయినా మంచి బట్టలేసుకో… నీ తండ్రి స్థాయిని మరీ దిగజార్చకు” అంటూ సలహాలిస్తున్నారు. అయినా సారా అలీ ఖాన్ కి ఇలాంటి సలహాలు కొత్తేమీ కాదు, ఈ భామ అందాలు ఆరబోసిన ప్రతిసారి నెటిజన్లు ఇలాంటి సలహాలు ఇవ్వడానికి, సూచనలు చేయడానికి కాసుకొని కూర్చుంటారు. అయినా సారా అలీ ఖాన్ మాత్రం అందాల ఆరబోతలో బాగా రెచ్చిపోతుంది. దాంతో ఆమె ఫోటోల కింద కామెంట్లు దారుణంగా వస్తున్నాయి.
మీ పిన్ని కరీనా కపూర్ ఇలాంటివి నీకు బాగా నేర్పిందా ఏమిటి ? అని ఒకరు, ‘అయినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో మాకు తెలుసులే’ అని మరొకరు ఈ తరహాలో సాగుతున్నాయి కామెంట్లు. అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సారా అలీ ఖాన్, అనన్య పాండే లాంటి భామలు ఇంత దిగజారి పోయి ఎక్స్ పోజింగ్ చేసి ఫోటోలు షేర్ చేసినా ఉపయోగం ఉండటం లేదు. వాళ్లకు ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. సారా అలీ ఖాన్ పూర్తిగా చిన్నాచితకా చిత్రాలకే పరిమితం అయింది. అలాగే అనన్య పాండే ఓటీటీ షోలకు పరిమితం అయింది. జాన్వీ కపూర్ కూడా జిమ్ స్టిల్స్ తో వైరల్ కావడానికి ఫిక్స్ అయింది. మరి వీళ్ల ఎక్స్ ఫోజింగ్ కి తగిన ప్రతిఫలం ఎప్పుడు వస్తోందో !.