ఈటెల రాజేందర్ పార్టీ మార్పుపై గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బీజేపీకి గుడ్ బై చెబుతారని, పార్టీలో ఆయనకు ప్రాధాన్యత కరువైందని ఈ రకమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వార్తలపై ఈటెల కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వచ్చారు. తాను పార్టీ మారడం లేదని, బీజేపీని వీడబోనని చెబుతూ వచ్చారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అనూహ్యంగా పార్టీలో సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై మరోసారి చర్చ జరుగుతోంది. బీజేపీ తరపున రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటెల రెండు చోట్ల కూడా ఓటమి చవిచూశారు. ఇకపోతే గతంలో బిఆర్‌ఎస్ లో ఉన్నంత యాక్టివ్ గా ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండడం లేదనే టాక్ గట్టిగా వినిపించింది.
బీజేపీలో చేరిన మొదటి నుంచే పార్టీ అధిష్టానంపై అలకబునుతూ వచ్చారు ఈటెల. దాంతో ఇతర నేతలను పక్కన పెట్టేంతలా అధిష్టానం ఈటెలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. అయినప్పటికి పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో ఈటెల కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఈటెలకు ప్రదాన్యతను ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఇతర నేతలు ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలలో చేరారు. దీంతో ఈటెల కారణంగానే బీజేపీ బలహీన పడిందనే టాక్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తువచ్చింది.
ఈ నేపథ్యంలో ఈటెలను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నట్లు స్వయంగా ఈటెలనే చెప్పడం గమనార్హం. ఈ మద్య తాను పార్టీ మరి కాంగ్రెస్ లో చేరతానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తనపై కావాలనే పార్టీలోని కొంతమంది నేతలు దుష్ప్రచారం చేయిస్తున్నారని స్వయంగా ఈటెలనే చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదని ఈటెల చెబుతున్నప్పటికీ అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆయన బీజేపీ వీడిన ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది. మరి ఈటెల ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
Also Read:ఉసిరి గురించి ఇవి తెలుసా..