నేటి రోజుల్లో ప్రతిఒక్కరి ఇంట్లో ఫ్రీడ్జ్ తప్పనిసరిగా ఉంటుంది. దాంతో ఫ్రీడ్జ్ నీరు త్రాగడం ఒక అలవాటుగా మారుతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, లేదా నీరు దాహం వేసినప్పుడు కచ్చితంగా ఫ్రీడ్జ్ లోని కూలింగ్ వాటర్ తాగడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా చెప్పాలంటే భోజనం చేసే టప్పుడు కూడా చల్లని నీరు త్రాగనిదే కొందరికి ముద్ద కూడా దిగదు.
మరికొంతమందైతే కేవలం 10 నిమిషాల్లోనే భోజనాన్ని కంప్లీట్ చేసేస్తారు. చాలా మంది టీవీ లేదా చరవాణి చూస్తునో యథాలాపంగా తింటున్నారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓ సర్వేలో 10 నిమిషాలు – 26 మంది,15 నిమిషాలు – 42 మంది,20 నుంచి 30 నిమిషాలు – 32 మంది మంది తినే సమయంలో టీవీ లేదా సెల్ ఫోన్ చూస్తు తింటున్నారని తేలింది. అయితే అన్నంను త్వరగా తినడం కంటే పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు ప్రశాంతంగా నమిలి తినడం ద్వారా లాలాజల గ్రంథులు చురుగ్గా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. బాగా నమలడం ద్వారా ఆహారం మెత్తగా మారి జీర్ణ వ్యవస్థకు శ్రమను తగ్గిస్తుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. నమిలి తింటున్నప్పుడు నాలుకకు రుచి తెలుస్తుందని తద్వారా పోషకాలు శరీరానికి త్వరగా అందడంతో బరువు తగ్గడం సాధ్యమవుతుందని వెల్లడించారు.
Also Read:విజయవాడ – శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’