కళ్ళు పొడిబారుతున్నాయా..జాగ్రత్త!

76
- Advertisement -

నేటి రోజుల్లో చాలమంది కంప్యూటర్, మొబైల్స్ , టీవి వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో కాలాన్ని గడిపేస్తుంటారు. ముఖ్యంగా మొబైల్, కంప్యూటర్ లేనిదే ఏ పని జరగదంటే అతిశయోక్తి కాదు. రోజంతా వీటితోనే వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో వీటి ప్రభావం ముఖ్యంగా కళ్లపై అధికంగా అధికంగా పడుతుంది. వీటి నుంచి వచ్చే లైటింగ్ నేరుగా కళ్ళకు చేరుకోవడం వల్ల చాలామందిలో కంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దానికి తోడు ప్రజెంట్ ఈ సీజన్ లో కండ్లకలక ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాంతో కళ్ల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్ గా మారింది. .

మొబైల్స్, మరియు కంప్యూటర్స్ స్క్రిన్ లను ఎక్కువ సేపు చూడడం వల్ల కళ్ల ఆరోగ్యం చాలా త్వరగా దెబ్బ తింటుంది. ముఖ్యంగా కళ్ళు పొడిబారడం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు చుట్టుముడతాయి. కళ్ళు పొడిబారిన వారికి కంట్లోని తడి ఆరిపోతుంది. ఫలితంగా కంట్లోనుంచి నీరు కారడం, కళ్ళల్లో మంట, దురద, కళ్ళు ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

కాబట్టి కళ్ళు పొడిబారకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కంప్యూటర్స్ తో ఎక్కువ సమయం గడిపే వారు ప్రతిపది నిముషాలకు ఒకసారి కంప్యూటర్ కు ఉండాలి. అలాగే మొబైల్ ను స్క్రీన్ ను కూడా ఎక్కువ సేపు చూడకూడదు. కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసేవారు కనీసం 30 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో కూర్చోవాలి. ఇంకా కళ్ళకు సేఫ్టీగా కళ్ళద్దాలు దరించడం మంచిది. ఇంకా తినే ఆహారంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆకు కూరాలను, కూరగాయలను ఎక్కువగా తినాలి. అలాగే విటమిన్ ఏ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కళ్ళు పొడిబారుతున్న లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read:వామ్మో..ఇప్పపువ్వుతో లాభాలెన్నో!

- Advertisement -