షుగర్ ఉంటే మద్యం తాగొచ్చా..?

63
- Advertisement -

నేటిరోజుల్లో షుగర్ వ్యాధి అత్యధిక మందిని పట్టి పీడిస్తున్న అతి పెద్ద అనారోగ్య సమస్య. ప్రతి పది మందిలో కనీసం ఇద్దరు షుగర్ వ్యాధితో బాధ పడుతున్నట్లు పలు అధ్యయనలు చెబుతున్నాయి. రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగితే మధుమేహానికి దారి తీయవచ్చు. షుగర్ వ్యాది వచ్చిన వారు దీని నుంచి అంతా త్వరగా బయటపడలేరు. అనేక రోగాలకు షుగర్ వ్యాధి అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఆహారపు అలవాట్ల విషయంలో ఎంతో జాగ్రతగా ఉండాలి. ముఖ్యంగా ఏది పడితే అది తినడం, ఏది పడితే అది తాగడం వంటివి అసలు చేయకూడదు. ముఖ్యంగా గ్లూకోజ్ కలిగిన చక్కెర పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. .

అయితే వీటన్నిటికి కాస్త పక్కన పెడితే.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మద్యం సేవించవచ్చా ? అనే డౌట్ చాలమందిలో ఉంటుంది. ఎందుకంటే చాలమందికి ప్రతిరోజూ మద్యం తాగే అలవాటు ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవాళ్ళు మద్యం తగవచ్చా ? ఒకవేళ తాగితే ఎలాంటి అనార్థాలు సంభవిస్తాయి అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. మన శరీరంలో గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తూ.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Also Read:ఉద్యోగుల కష్టాలు కనిపించడం లేదా

అయితే ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీంతో షుగర్ లెవెల్స్ పడిపోవడం లేదా అధికం అవడం జరుగుతుంది. ఫలితంగా హైపోగ్లైసిమియాకు దారి తీయవచ్చు. ఇంకా షుగర్ వ్యాధిగ్రస్తులకు మద్యం కూడా తోడైతే లివర్ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నాడీ వ్యవస్థ క్షీణిస్తుంది. కాళ్ళు మొద్దుబారడం, తిమ్మిర్లు, శరీరంలో మంట, నిసత్తువ, బలహీనత, వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -