తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలే. వంటిని మరో 100 రోజుల్లో పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ధీమాగా చెబుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి హామీ కూడా ధనవ్యయంతో కూడుకున్నది కావడంతో నిజంగా ఆరు హామీల అమలు వంద రోజుల్లో జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దాంతో ఆర్టీసీ ఆదాయం ఇప్పటికే భారీగా పడిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. .
ఇంకా త్వరలోనే రూ. 500 లకే వంట గ్యాస్ అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఇవి కాకుండా ఆరు గ్యారెంటీలలో ఇంకా ఐదు హామీలు ఉన్నాయి. మరి రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీ హామీల అమలు సాధ్యమేనా అనే భయం నేతలను వెంటాడుతోందట. అలాగే పార్టీలో పదవుల విషయంలో కూడా అసంతృప్త వాదులు పెరుగుతున్నట్లు టాక్. ఇప్పటికే 11 మందికి మంత్రి పదవులు కేటాయించి శాఖలు ప్రకటించిన వేళ కొంతమంది వారికి కేటాయించిన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు టాక్. వారంతా కూడా వ్యతిరేకత చూపితే పార్టీని నష్టం తప్పదనే వాదన జరుగుతోంది. అంతే కాకుండా ప్రభుత్వం కూలిపోతుందేమో అనే భయం కూడా హస్తం నేతలను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. మరి ముందు రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Also Read:IND vs SA T20 :సమం చేస్తారా? సమర్పిస్తారా?