చలికాలంలో చన్నీటిస్నానం..ఎన్ని సమస్యలో?

78
- Advertisement -

వింటర్ సీజన్ లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. తద్వారా వాతావరణమంతా చాలా కూల్ గా మారిపోతుంది. అసలు ఉదయం పూట బయటకు అడుగు పెట్టలేనంతగా చలి వేధిస్తుంది. 9-10 దాటిన చలి తీవ్రత తగ్గకపోవడం వల్ల ఆఫీస్ వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఉదయాన్ని లేచి స్నానం చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. అయితే చలి కారణంగా చాలమంది వేడినీటి స్నానం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. మరికొందరేమో ఎంత చలి ఉన్న చన్నీటి స్నానమే చేస్తుంటారు. అయితే చలికాలంలో చన్నీటి స్నానం మంచిదేనా లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా ? అంటే ఆరోగ్య నిపుణులు రెండు ఉన్నాయని చెబుతున్నారు. ఉదయాన్నే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం ఉత్తేజానికి లోనవుతుంది. తద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా చన్నీటి స్నానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారట. అయితే చలికాలంలో చన్నీటి స్నానంతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చన్నీటితో తలస్నానం చేస్తే ఫ్లూ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్వారికి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు కూడా ఎటాక్ అవుతాయి. ఇంకా వైరల్ ఫీవర్, చలి జ్వరం.. వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చలికాలంలో తలస్నానం చేసే విషయంలో చన్నీటి స్నానానికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే తలస్నానం చేసేటప్పుడు నీరు గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఆయా ఆరోగ్య సమస్యల దృష్ట్యా వీలైనంత వరకు చలికాలంలో చన్నీటికి దూరంగా ఉండడమే మేలని నిపుణులు చెబుతున్నారు.

Also  Read:మెట్లు ఎక్కండి…ఇలా బరువు తగ్గండి!

- Advertisement -