మెగాస్టార్ దాన్ని నిలబెట్టుకుంటాడా?

40
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. చిరు 50 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్నారట. భోళా శంకర్ కి కూడా చిరు భారీగా తీసుకున్నాడు. కలెక్షన్స్ కి చిరంజీవి చాలు అనుకునే రోజులు పోయాయి. అఫ్‌కోర్స్ సినిమాలో కీర్తీ సురేష్ ఉంది, సుశాంత్ ఉన్నాడు.. తమన్నా ఉంది… ఐతేనేం… సినిమా మొత్తం చిరంజీవి హీరోయిజం చుట్టూ తిరుగుతుంది… మిగతావాళ్లు ఆయా పాత్రల్లో బాగా నటించొచ్చు. భోళా శంకర్ సినిమాకు వచ్చేసరికి వారంతా జీరోలే… పైగా వీరిలో ఒక్క కీర్తి సురేష్ కి తప్ప ఎవరికీ పెద్ద ప్రాధాన్యమున్న పాత్ర లేదు…

ఎన్నో ఏళ్ల తర్వాత, సిస్టర్ సెంటిమెంట్ అంటూ కీర్తీ సురేష్ గురించి ఊదరగొట్టారు గానీ, తాజా సమాచారం ప్రకారం ఆమె పాత్రకు కూడా పెద్ద సీన్ లేదు అని టాక్… అంతెందుకు… హీరోయిన్ తమన్నా కూడా రెండు పాటలు, రెండు సీన్లకు మాత్రమే పరిమితం అవ్వబోతుందట. ఇక హీరో సుశాంత్ గురించి మరో మాట అనవసరం. ఇక సంగీతం విషయానికి వద్దాం.. సంగీతం అంటే గుర్తొచ్చింది… ఈ సినిమాలో మరో హీరో ఎవరంటే… స్వర సాగర్ మహతి… సంగీత దర్శకుడు… ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సంగీత దర్శకులకు ఉన్నంత డిమాండ్, అట్రాక్షన్ స్వర సాగర్ మహతి కు ఏ మాత్రం లేదు.

Also Read:హిమాలయాలకు రజినీ..జైలర్ పరిస్థితేంటి?

పైగా పెద్ద హీరో లెవ్వరూ స్వర సాగర్ మహతిను నమ్మరు. అలాంటిది.. మెగాస్టార్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఐతే, వచ్చిన అవకాశాన్ని స్వర సాగర్ మహతి బాగా వాడుకున్నాడు అని తెలుస్తోంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం అదరగొట్టాడు అని అంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా మెగాస్టార్ పోషించిన ప్రధానపాత్రకు వచ్చే నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందట. రేపు సినిమా రిలీజ్ అయ్యాక భోళా శంకర్ కి స్వర సాగర్ మహతి హీరో అవుతాడని అంటున్నారు. ఇంతకీ భారీ కలెక్షన్స్ రాబట్టి.. మెగాస్టార్ తన స్టార్ డమ్ ను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -