చంద్రబాబుది అహంకారమా? అవివేకమా?

47
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఎలాగైనా ఈసారి ఏపీలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇటీవల స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్ స్కామ్.. అంటూ కొన్ని స్కామ్ లు ఆయనను చుట్టుముట్టడంతో కొంత స్లో అయ్యారు. ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైఎస్ జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఏ చిన్న అవకాశం దొరికిన ఉపయోగించుకునే ప్లాన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తిరిగి ఆయనకే ఇబ్బందిలా మారుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలనుద్దేశించి వైఎస్ జగన్ కు ఆపాదిస్తూ చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. .

అహంకార దొరణితో ఉంటే ప్రజలు బుద్ది చెబుట్టారని, తెలంగాణలో అదే జరిగిందని వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా జరగబోతుందని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఏపీతో పోల్చితే తెలంగాణ అన్నీ రంగాల్లోనూ అభివృద్ది సాధించిందని గతంలో కొనియాడిన బాబు.. ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ ఓడిపోవడంతో వెంటనే మాట మార్చి అహంకారం కారణంగానే ఓటమి పాలైందని చెప్పడం అవివేకమా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు. రాజకీయ లభ్దికోసం క్షణాల్లో మాట మార్చడం ఒక్క చంద్రబాబుకె చెల్లిందని బి‌ఆర్‌ఎస్ నేతలు మండి పడుతున్నారు. చంద్రబాబు నాయుడు అహంకారంతో మాట్లాడితే ఏపీ ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని బి‌ఆర్‌ఎస్ నేత సతీశ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో బాబు రాజకీయ ఊసరవెల్లి అనే ముద్ర సార్థకం చేసుకున్నారని విమర్శిస్తున్నారు మరికొందరు.

Also Read:వాటిలో మాత్రమే ఉచితం..అన్నిట్లో కాదండోయ్!

- Advertisement -