అరెస్ట్ : చంద్రబాబుకు ప్లేస్సా?మైనస్సా?

35
- Advertisement -

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సంచలనాలకు దారి తీస్తోంది. ఆయన సి‌ఎం గా ఉన్నప్పుడూ 2015లో స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా రూ.241 .కోట్లు అవకతవకలు జరిగాయని నిన్న సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నలబై ఏళ్ల సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆయన సి‌ఎం గాను, ప్రతిపక్ష నేతగాను తనకంటూ ప్రత్యేకత ను ఏర్పరచుకొన్నారు. అలాంటి చంద్రబాబు అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఏపీలో ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉంది. దాంతో ఎలక్షన్స్ ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈ అంశం టీడీపీపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను గద్దె దించాలని గట్టిగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు తన అరెస్ట్ ను సానుభూతిగా మలచుకొనే అవకాశం ఉంది. .

ఎందుకంటే తనపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి జైలు కు పంపించారని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా టీడీపీ మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ప్రస్తుతం చంద్రబాబును ఏ1 గా చెరిచింది సీఐడీ. ఈ నేపథ్యంలో ఆయన దోషిగా నిరూపితం అయితే టీడీపీకి గట్టిగానే నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు హయంలో జరిగిన అవినీతి ప్రజల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని నిర్మాణంలో రూ.118 కోట్ల అవినీతి అలాగే ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూ.241 కోట్ల అవినీతి ఇవన్నీ కూడా చంద్రబాబు ఇమేజ్ ను గట్టిగానే దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో టీడీపీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరి మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ కావడం.. టీడీపీకి అనుకూలతతో పాటు ప్రతికూలతను కూడా పెంచే అవకాశం ఉంది.

Also Read:Chandrababu: కుట్రదారు చంద్రబాబే..నాకేం తెలియదు!

- Advertisement -