చంద్రబాబు అరెస్ట్ వెనుక.. భారీ వ్యూహమా ?

30
Chandrababu
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా ఉంది. గత వారం రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సి‌ఎం గా ఉన్నప్పుడూ అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రత్యక్షంగా బాబు అవినీతికి పాల్పడ్డారని ఆయనకు రూ.118 కోట్లు అందాయని ఐటీ శాఖ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయన అరెస్ట్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వయంగా చంద్రబాబే తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో రాజకీయాలు వేడెక్కాయి..

అనుకున్నదే జరిగినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ను సిఐడి అరెస్ట్ చేసింది. ఆయన సి‌ఎం గా ఉన్నప్పుడూ 2015 లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం సిమెన్స్, డిజన్ టెక్ సంస్థలతో రూ.3,356 కోట్ల ప్రభుత్వం ఒప్పందం జరుగగా.. అందులో రూ.371 దారి మల్లాయని 2020లో వైసీపీ ప్రభుత్వం విచారణకు అధెశించింది. విజిలెన్స్, ఏ‌సి‌బి పలుమార్లు విచారించగా ఆ తరువాత ఈ కేసు సీఐడీ టేకాఫ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో చంద్రబాబును ఏ1 గా చేర్చుతూ పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసింది సీఐడీ.

ఇక ఏ2గా టీడీపీ మరో నేత అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే చంద్రబాబు అరెస్ట్ పక్కా వ్యూహంతో కక్షపూరితంగా జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. సీఐడీ ఇచ్చ్హిన రిపోర్ట్ లో చంద్రబాబు పేరును మెన్షన్ చేయకుండా అరెస్ట్ చేశారని, ఇదంతా వైసీపీ సర్కార్ కక్షపురితంగా చేస్తోందని చెబుతున్నారు చంద్రబాబు. కాగా ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రస్తుతం టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజా పరిణామాలను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Also Read:విశ్వక్ సేన్…“రామన్న యూత్”

- Advertisement -