Chandrababu:బాబు మళ్లీ జైలుకెళ్ళాల్సిందేనా?

70
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో భాగంగా 53 రోజులు జైలు రిమాండ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్టి మొదట నాలుగు వారాల బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసిన సంగతి విధితమే. అయితే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ కోర్టును ఆశ్రయించగా.. దీనిపై నేడు హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన స్కిల్ స్కామ్ లో భాగమైన వారు ఎవరు జైల్లో లేరని, అందుకే చంద్రబాబు కు కూడా బెయిల్ మంజూరుకు ఒకే చెప్పినట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జున్ రావు స్పష్టం చేశారు. .

అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటి ఆపరేషన్ చేయించుకున్న చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్యలు కూడా వేధిస్తున్నాయని ఇటీవల వైద్యులు స్పష్టం చేశారు. ఆయన గుండె అరిమాణం పెరుగుతోందని, హార్ట్ ఎటాక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఆలాగే రక్త ప్రసరణలో కూడా లోపాలు ఉన్నాయని వైద్యులు నివేధిక ఇచ్చారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంచితే గతంలో మంజూరు చేసిన మద్యంతర బెయిల్ గడువు ఈ నెల 28తో ముగియనుంది. అందువల్ల ఆయన 28న మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలు కు వెళ్తారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇక జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. దాంతో ఇకపై చంద్రబాబు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే స్కిల్ స్కామ్ లో రెగ్యులర్ బెయిల్ లభించినప్పటికీ అమరావతి రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్ వంటివి ఇంకా పెండింగ్ లోనే ఉండడంతో మళ్ళీ చంద్రబాబు జైలుకు వెళ్ళే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.

Also Read:Mangalavaram:’మంగళవారం’ ఆ లిస్ట్‌లో చేరినట్టే

- Advertisement -