BJP:తెలంగాణలో బీజేపీ పాచిక పారేనా?

13
- Advertisement -

ఎన్నికలు వచ్చాయంటే చాలు తెలంగాణపై దండయాత్రకు సిద్ధమవుతోంది బీజేపీ. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి తెలంగాణపై ఫోకస్ చేసి అధికారంలోకి వస్తామనే భ్రమను ప్రజల్లో పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వివిధ రాష్ట్రాల సీఎంలు,కేంద్రమంత్రులు ఇలా ఒకరి పర్యటన తర్వాత మరొకరి పర్యటన చేస్తూ హంగామా చేశారు. కానీ తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఢీలా పడ్డారు. సీనియర్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు.

టార్గెట్ 12 అంటూ ఇతర పార్టీల నేతలకు గాలం వేసి మరి టికెట్లు ఇచ్చారు.అయితే అభివృద్ధి గురించి చెప్పని కమలం నేతలు ,కేవలం మతాన్ని రెచ్చగొడుతూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు రీపిట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇర కమలనాథులు తాము గెలిచే స్థానాల్లో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్లతో పాటు మహబూబ్‌నగర్, మెదక్, భువనగిరి, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్ నాలుగు సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులపైనే కాదు బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రధానంగా కిషన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నిపార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమైందని ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా టూర్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు కాషాయ నేతలు. ఈ నెల 30న జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మోడీ ప్రచారం ఉండేలా ప్లాన్ చేశారు. అలాగే మే 3న వరంగల్ సెగ్మెంట్‌ పరిధిలో ఒక సభ, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలకు కలిపి మరో సభ,మే 4న మహబూబ్‌నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు మోడీ. అయితే అగ్రనాయకత్వాన్ని దింపి లబ్దిపొందాలని కాషాయ నేతలు చూస్తున్న ప్రజలు మాత్రం ఆ పార్టీ వైపు చూస్తారా అంటే కష్టమేననే వాదన వినిపిస్తోంది.

Also Read:TTD:వైభవంగా కోదండరాముని పుష్పయాగం

- Advertisement -