బీజేపీ జనసేన కలిస్తే.. ఎవరికి నష్టం?

35
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చిన బీజేపీ.. ఎన్నికల ముందు ప్లాన్ మార్చింది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే పార్టీ రేస్ లో నిలబడుతుందనే అభిప్రాయానికి వచ్చారో ఏమో గాని వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు కమలం పార్టీ పెద్దలు. ఆల్రెడీ ఏపీలో జనసేనతో పొత్తులో ఉంది బీజేపీ. కానీ తెలంగాణలో మాత్రం పొత్తు జనసేనతో కలిసి నడిచే ప్రసక్తి లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ చెబుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచారంగా ఉంది. సరైన అభ్యర్థుల కొరత, పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీని ఒక్కొక్కరుగా విడుతున్న నేతలు.. అలా చాలా సమస్యలే ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగితే పార్టీకి భారీ నష్టం తప్పదు.

అందుకే ఆల్రెడీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీతో కలిసి నడిస్తే ఎంతో కొంత మేలని భావిస్తోంది కాషాయ పార్టీ అధిష్టానం. అయితే జనసేన బీజేపీ కలిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో జనసేన కంటే బీజేపీ కొంత మెరుగ్గా ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో మాత్రం బిజెపికి పెద్దగా పట్టులేదు. ఈ నేపథ్యంలో జనసేన తో కలవడం వల్ల ఆ వర్గాల్లో కొంత ఓటు బ్యాంకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎటొచ్చీ బీజేపీ తో కలిసి పోటీ చేయడం జనసేన పార్టీకే నష్టం అనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు బీజేపీపై కొంత గుర్రుగా ఉన్నారు. రాష్ట్రానికి ఇవ్వాలలసిన నిధుల విషయంలో మోడీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని, తెలంగాణ పట్ల చిన్న చూపు వహిస్తోందని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ ప్రభావం బీజేపీతో కలిసి నడిచే జనసేన పార్టీపై పడే అవకాశం ఉంది. మరి ఈ రెండు పార్టీలపై రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:కుంకుమ పువ్వుతో లాభాలు..

- Advertisement -