బండి సంజయ్ పనైపోయిందా..?

52
- Advertisement -

పార్టీ ప్రక్షాళనలో భాగంగా బీజేపీ అధిష్టానం కొన్ని రాష్ట్రాలలో అధ్యక్షుల మార్పు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న బండి సంజయ్ ని తప్పించి ఆయన స్థానాన్ని కిషన్ రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం. గత కొన్నాళ్లుగా బండి సంజయ్ నాయకత్వంపై పార్టీలో అసంతృప్త జ్వాలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించడం అనివార్యం అయింది. అయితే బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష బాద్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందనే ఉద్దేశంతో ఆ పదవి నుంచి బండిని తొలగించడానికి మొదట అధిష్టానం ససేమిరా అంటూ వచ్చింది.

కాగా రాష్ట్రంలో బీజేపీ బలపడిందా లేదా అనే విషయాన్ని అటుంచితే.. చాలా సందర్భాల్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాలకు దారి తీశాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం, మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ విషయంలో అనుభవ లేమితో మాట్లాడడం.. ఇలా చాలా అంశాలలో బండి సంజయ్ పై వ్యతిరేక భావం ఉంది. అందువల్ల బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే మేలని బీజేపీలోని ఒక వర్గం నుంచి వినిపిస్తున్న మాట. అయితే బండిని పార్టీ బాద్యతల నుంచి తప్పించిన తరువాత నెక్స్ట్ ఆయన పరిస్థితి ఏంటి అనే చర్చ జోరుగా సాగుతోంది.

Also Read:ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే..!

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందట. అయితే ఆయన తనకు ఏ పదవి వద్దని, తాను బీజేపీ కార్యకర్తగానే ఉంటానని చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించడంలో అసంతృప్తి నెలకొన్నాట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ ఎలాంటి బాద్యతలు అప్పగించకపోతే పార్టీ కార్యకలాపాల పరంగా బండి సంజయ్ చురుకుగా పాల్గొనే అవకాశం ఉండదు. దీంతో మెల్లగా బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో తెరవెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అసలే బండి సంజయ్ పై అవగాహన లేమి నాయకుడు అనే ముద్ర గట్టిగా ఉంది. ఇప్పుడు ఏ పదవి లేకపోతే.. ఆయన బీజేపీలో ఫెడ్ అవుట్ అయిన ఆశ్చర్యం లేదు.

Also Read:సిరిసిల్లకు మంత్రి కేటీఆర్..

- Advertisement -