సత్తెనపల్లి ఎమ్మెల్యే ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సీటు విషయంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలుపొందిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఈసారి ఆయనకు సీటు కేటాయిస్తారా ? లేదా ? అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నాయకుల నుంచి అంబటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంబటికి సీటు కేటాయిస్తే మళ్ళీ గెలిచే అవకాశం లేదని, అందువల్ల ఆయనకు టికెట్ కేటాయించకపోవడమే మంచిదని స్థానిక నేతలు అధిష్టానంతో వాపోతున్నారు. పైగా ప్రజల్లో అంబటిపై నానాటికీ వ్యతిరేకత పెరుగుతున్నట్లు వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. .
ఆయన వ్యవహార శైలి, మాట తీరుపై తరచూ విమర్శలు వ్యక్తమవుతూనే ఉంటాయి. పైగా అభివృద్ది విషయంలో కూడా నియోజక వర్గంలో చేసిందేమి లేదని, ఆయన ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని సత్తెనపల్లి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అంబటి రాంబాబుకు టికెట్ కేటాయిస్తే ఓడిపోవడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. వైసీపీ అంతర్గత సర్వేలలో కూడా ఇదే రిపోర్ట్ వచ్చినట్లు టాక్. అందుకే అంబటికి సీటు కేటాయించే విషయంలో వైఎస్ జగన్ ఆలోచనలో పడ్డట్లు టాక్.
సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. కాపుల్లో బలమైన ఆధారణ ఉన్న కన్నాపై పై అంబటి గెలవడం కష్టమే అనే అభిప్రాయాలు ఆకుద వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామలన్నిటిని బేరీజు వేసుకొని అంబటికి నో టికెట్ అంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీ టికెట్ దక్కకపోతే పార్లమెంట్ టికెట్ అయిన కేటాయిస్తారా ? లేదా అనేది ప్రశ్నార్థకమే. ఏది ఏమైనప్పటికి వ్యంగ్యస్త్రాలకు పెట్టింది పేరైన అంబటి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read:Modi:పెద్ద ప్లానే ఇది.. మోడీజీ!