వేసవిలో ఏసీ వాడుతున్నారా.. జాగ్రత్త!

23
- Advertisement -

సమ్మర్ వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ కూలర్, ఏసీ వంటివి కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఎందుకంటే బయట మండిపోయే ఎండల కారణంగా ఇంటికి వచ్చినప్పుడు చల్లగా సేదతీరేందుకు ఏసీ, కూలర్ వంటివి చాలా బాగా ఉపయోగ పడతాయి. కొంతమంది ఏసీలు కొనలేనివాళ్ళు.. పనిచేసే ఆఫీస్ లోనే ఏసీ గదులలో ఎక్కువగా గడుపుతుంటారు. ఏసీలకు అలవాటు పడినవారు బయటకు రావడానికి ఏ మాత్రం ఆసక్తి చూపారు. ఇలా ఎక్కువగా ఏసీ రూం లలో గడిపితే ప్రమాదమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఒక్కసారి ఏసీకి అలవాటు పడితే బయటి ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయట.

ఏసీలో ఎక్కువసేపు గడిపి ఒక్కసారిగా బయటకు వస్తే ఎండ వేడిమిని తట్టుకోవడం కష్టమౌతుంది. అందువల్ల కళ్ళకు మైకం కమ్మడం, చర్మం మంటగా అనిపించడం, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏసీలో గడిపే వారికి కొద్దిపాటి ఎండ తగిలిన వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏసీ గదులలో ఉండే శీతల ఉష్ణోగ్రత కారణంగా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

ఇంకా ఏపీ గదుల్లో ఎక్కువగా గడిపే వారికి శ్వాస సంబందిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వేసవిలో ఏపీ గదులకు అలవాటు పడితే ప్రమాదమే. అందువల్ల నిత్యం ఏసీలో గడిపే వారు ప్రతి అరగంటకోసారి బయటి వాతావరణంలో కూడా తిరగాలి. ఇంకా ఏపీ యొక్క టెంపరేచర్ ను 20-25 మద్య ఉండేలా చూసుకోవాలి. అంతకంటే తక్కువ టెంపరేచర్ ఉపయోగిస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా బయటి ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వేసవిలో ఏపీ గదుల్లో ఉండేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:56 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్..

- Advertisement -