ఫైనల్ మ్యాచ్‌కు అభిషేక్ ఔట్..కుల్దీప్ ఇన్!

1
- Advertisement -

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ తుది పోరు మార్చి 8 (ఆదివారం) నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ కీలక మ్యాచ్‌కు భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఆయన కేవలం 89 పరుగులు మాత్రమే చేశారు. అందుకే ఫైనల్ మ్యాచ్‌లో ఆయనను బెంచ్‌పై కూర్చోబెట్టి, అతని స్థానంలో రింకు సింగ్, కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వవచ్చని వార్తలు వస్తున్నాయి.

సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతన్ని తప్పిస్తే ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఓపెనర్‌గా ఇషాన్ రెండు అర్ధసెంచరీలు సాధించాడు.

అభిషేక్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సెమీఫైనల్లో భారత్‌కు స్పెషలిస్ట్ ఆరో బౌలర్ లేకపోవడం కనిపించింది. కుల్దీప్ ఇప్పటివరకు 54 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో కుల్దీప్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు.

భారత్ జట్టు అంచనా!

సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

- Advertisement -