ఐరన్ లోపమా..జాగ్రత్త?

45
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తగ్గిన ఆరోగ్యం విషయంలో శరీరం అదుపు తప్పుతుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకలు గా భావించే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటివి మన శరీరంలో ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తగ్గిన ఆరోగ్యం అసమతుల్యం గా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐరన్ లోపిస్తే చాలా ప్రమాదమట. ఎందుకంటే ఎర్ర రక్త కణాల వృద్దిలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఐరన్ ఎంతో కీలకం. అలాగే మెదడు పని తీరులోనూ ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది లోపించడం వల్ల శరీర అవయవలన్నిటిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మహిళల్లోనూ, చిన్న పిల్లల్లోనూ ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారిలో చిన్న చిన్న పనులకే అలసట రావడం, విపరీతమైన నీరసంగా మారడం, ఆకలి మందగించడం, బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ మైకం కమ్మడం వంటి లక్షణాలు కూడా ఐరన్ లోప లక్షణాలే. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపం ఉన్నవారు తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. చికెన్, పాలు, గుడ్డు వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఐరన్ లోపంలో బాధపడే వారు వీటిని ఆహార డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇంకా తృణ దన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, నట్స్.. వంటి వాటిలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ …సెకండ్ లుక్

- Advertisement -