యుద్ధం మొదలైంది:ఇరాన్

6
- Advertisement -

యుద్ధం మొదలైంది అని ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన పోస్ట్ చేశారు. ట్రంప్ వార్నింగ్ అనంతరం ఈ సంచలన ప్రకటన చేశారు ఖమేనీ. యూదు టెర్రరిస్టులపై దయ చూపబోం అని సరైన సమాధానం చెబుతామని వెల్లడించారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖమేనీ ఓ ఈజీ టార్గెట్.. ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతానికి ఖమేనీని హతమార్చాలని అనుకోవడం లేదు… అయితే క్షిపణులు సామాన్య పౌరులను బలి తీసుకోవడాన్ని సైతం మేం కోరుకోవడం లేదు అన్నారు. మా ఓపిక తగ్గిపోతోంది.. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి అని సూచించారు ట్రంప్.

Also Read:రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు!

- Advertisement -