అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

3
- Advertisement -

అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల యుద్ధ నౌకపై అమెరికా సబ్ మెరైన్ దాడి జరిగిన ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ ప్రభుత్వం, దీనికి అమెరికా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఈ ఘటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా చేసిన చర్యలను ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదని, ఈ ఘటనపై త్వరలోనే అమెరికా పశ్చాత్తాపపడే పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సైనికులపై జరిగిన ఈ దాడి కేవలం ఒక సంఘటన మాత్రమే కాదని, దీనికి తగిన సమాధానం తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు.

Also Read:Iran: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

ఇరాన్ సైనికుల రక్తం వృథా కాదని, దేశ గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామని అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ఇక ఈ పరిణామాలతో అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -