- Advertisement -
ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. ఎనమిదో రోజుప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇరాన్‌లోని 80 పట్టణాలు, నగరాలకు ఈ నిరసనలు విస్తరించగా మహిళల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. భద్రతా బలగాలు జరిపిన అణిచివేతలో ఇప్పటివరకు కనీసం 50 మంది పౌరులు మరణించారని ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
హిజబ్ ధరించలేదన్న కారణంతో మాసా అమీని అనే 22 ఏండ్ల యువతిని టెహ్రాన్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కస్టడీలో తీవ్రంగా గాయపడిన ఆమె.. దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది.
- Advertisement -