- Advertisement -
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రైసీతో పాటు 8 మంది మృతి చెందారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. రైసీతోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్ దొల్లాహియాన్ కూడా మృతి చెందారు.
సోమవారం ఉదయం కూలిన హెలికాఫ్టర్ శిధిలాలను రెస్క్యూ టీం గుర్తించగా ఘటనా స్థలంలో ఎవరూ బ్రతికి ఉన్న అనవాళ్లు కనిపించడం లేదని తెలిపింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ దేశం సరిహద్దులో ఉన్న జోల్ఫా అనే నగరానికి సమీపంలో జరిగింది. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు సురక్షితంగా ల్యాండయ్యాయి.భారీ వర్షాలు, పొగమంచుతోపాటు తీవ్రమైన గాలి కారణంగా హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది.
Also Read:Harishrao:కుప్పకూలిన టీ డయాగ్నొస్టిక్స్
- Advertisement -