ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో రష్యా కూడా పరోక్షంగా రంగంలోకి దిగిందన్న వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా మీడియా నివేదికల ప్రకారం, రష్యా తన శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా సేకరించిన ఫోటోలు, డేటాను ఇరాన్‌కు అందిస్తున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా అమెరికాకు చెందిన వార్ షిప్స్, ఫైటర్ జెట్స్ లొకేషన్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా ఇరాన్‌కు చేరవేస్తున్నారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా రష్యా స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో తమకు పూర్తిగా తెలుసని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. జోర్డాన్‌లోని ఒక ఎయిర్ బేస్‌లో ఉన్న అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ THAADను ఇరాన్ క్షిపణితో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. క్షిపణితో గురి చూసి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇరాన్ ధ్వంసం చేసినట్టు సమాచారం.
ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఒక కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కోల్పోయిన విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించినట్లు సమాచారం.
Also Read:ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు?
ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

