- Advertisement -
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరోసారి సంచలన ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కాలు, చెయ్యి విరిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?” అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో కస్టడీ హింస ఆరోపణలపై కొత్త చర్చకు దారి తీసింది.
అబద్దాలు ఎప్పటికీ బయటపడతాయని, నిజం ఎప్పటికీ దాగదని సునీల్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు రఘురామకృష్ణరాజు అనుచరులు తమ వాదనలను బలపరుస్తుండగా, మరోవైపు ప్రతిపక్ష నేతలు ఈ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ ట్వీట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!
- Advertisement -

