ఆ ఐఏఎస్ కుమారుడి పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్..

207
marriage
- Advertisement -

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. తమ పెళ్లి గ్రాండ్ గా జరుపుకొవాలని చాలా మంది కళలు కంటుంటారు. పేద కుటుంబం నుంచి శ్రీమంతుల వరకు పెళ్లిని అంగరంగవైభవంగా జరుపుకుంటారు. కొంత మంది తమ వద్ద డబ్బులు లేకున్నా అప్పుచేసి మరి ఘనంగా పెళ్లిలు చేస్తారు. మరికొంత మంది చాలా ఖర్చుతో జరుపుకుంటారు. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన కూతురి పెళ్లి చాలా సింపుల్ గా చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగి ఇంట్లో పెళ్లి అంటే ఉండే హడావుడి అంతా ఇంతా కాదు.

Marriage

కానీ ఒక జిల్లా అధికారి రేంజ్ లో ఉండే ఐఏఎస్ మాత్రం తన కుమారుడి పెళ్లిని కేవలం 18వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేయబోతున్నాడు. అది ఎవరో అనుకుంటున్నారా? విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ది మండలి కమిషనర్ పట్నాల బసంత్ కుమార్. గతంలో ఆయన కూతురి పెళ్లికి కూడా కేవలం 16వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడంట. ఈనెల 10న విశాఖపట్నంలోని దయాల్ నగర్ లో సత్సంగ్ ఆధ్వర్యంలో వివాహం జరుగనుంది.

ఈవేడుకకు పెళ్లి కుమార్తె వారి తరపునుంచి రూ.18వేలు, పెళ్లి కుమారుడి తరపునుంచి వాళ్లు రూ.18వేలు మాత్రమే ఖర్చు చేయనున్నారు. ఇరు కుటుంబాలు కలిపి మొత్త రూ.36వేలు మాత్రమే ఖర్చు చేయనున్నారన్నమాట. వివాహ ఖర్చు, భోజనాలు అన్ని ఈ36వేల రూపాయల్లోనే సర్దుకుంటారు. పెళ్లి అనగానే లక్షల రూపాయలు ఖర్చు చేసే ఈరోజుల్లో కేవలం రూ.36వేలతో పెళ్లి చేశాడంటే ఈ ఆఫీసర్ సిస్సీయారిటీకి మెచ్చుకోవాలి.

- Advertisement -