రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైంది.ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జితేందర్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్. రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. తర్వాత ఢిల్లీ సీబీఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించారు.
ఆ తర్వాత డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేశారు. అనంతరం వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు తీసుకున్నారు. డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగనున్నారు.
Also Read:Miss AI:మిస్ ఏఐగా కెంజాలేలి