క్రికెట్ ఫెస్టివల్..ఫ్యాన్స్‌కు పండగే పండగ

248
world cup 2019
- Advertisement -

ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు క్రికెట్ మజాలో మునిగితేలిపోయేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానున్న ఐదు నెలలు అన్ని ఫార్మాట్లలో ఎంజాయ్ మెంట్ అందించేందుకు ఐసీసీ టోర్నీలతో పాటు ఐపీఎల్ సిద్దమవుతోంది.

ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌ ముగిసిన వెంటనే ఐపీఎల్‌ ఆమెరుపులు మరవక ముందే ప్రపంచకప్ సమరం. రానున్న ఐదు నెలలు క్రికెట్ ప్రియులకు పండగే పండగ. ఈనెల 24న విశాఖలో ఆసీస్‌తో జరిగే టీ20తో టూర్ ప్రారంభంకానుంది. మార్చి 13న ఢిల్లీలో జరిగే చివరి వన్డేతో ఆసీస్ టూర్ ముగియనుంది.

ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే పొట్టి క్రికెట్‌ టోర్ని,అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఓ వైపు ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్ షెడ్యూల్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐపీఎల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ప్రతీసారి కొన్ని మ్యాచ్‌లను తమ సొంత గ్రౌండ్స్లో ఆడుతున్న జట్లు ఈ సారి వేరే చోట ఆడవలసి ఉండనుంది. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా నిలవడంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్‌ చెన్నైలోనే జరగనుంది.

ఇక ఐపీఎల్ ముగియగానే వన్డే ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌కు బయలుదేరనుంది కోహ్లీసేన. మే 30న ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మధ్య తొలిమ్యాచ్‌తో వాల్డ్ కప్ సమరం ప్రారంభంకానుండగా జులై 14న లార్డ్స్ లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో రానున్న ఐదు నెలలు క్రికెట్  లవర్స్ కు పండగే కానుంది.

- Advertisement -