ఐపీఎల్ 16వ సీజన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమవుతుంది. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న 16వ సీజన్‌లో పలు మ్యాచ్‌లో హైదరాబాద్ వేదిక కానుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ జట్టు ప్రతినిధులు బీసీసీఐ హెచ్‌సీఏ ప్రతినిధులతో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు సీపీ తెలిపారు. ఇందుకుగాను స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రేక్షకులకు టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా సన్‌రైజర్స్ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టికెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
షెడ్యూల్
- ఏప్రిల్2న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్యాహ్నం 3.30
- ఏప్రిల్9న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్ సాయంత్రం 7.30
- ఏప్రిల్18న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబాయి ఇండియన్స్ సాయంత్రం7.30
- ఏప్రిల్ 28న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ సాయంత్రం 7.30
- మే4న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ సాయంత్రం7.30
- మే13న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్యాహ్నం 3.30
- మే18న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాయంత్రం 7.30
ఇవి కూడా చదవండి…