IPL:బెంగళూరులో ‘MLA టికెట్ల’ లొల్లి

5
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ఫైనల్ మ్యాచ్ వేదిక ఎంపిక బీసీసీఐకి తలనొప్పిగా మారింది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని భావించినప్పటికీ, అక్కడ నెలకొన్న ‘MLA టికెట్ల’ డిమాండ్ ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

బెంగళూరులో మ్యాచ్ నిర్వహిస్తే స్థానిక రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో కాంప్లిమెంటరీ (ఉచిత) టికెట్ల కోసం తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం స్టేడియం నిర్వహణ మరియు భద్రత విషయంలో సహకరిస్తున్నప్పటికీ, రాజకీయ వర్గాల నుండి వస్తున్న టికెట్ల డిమాండ్లను తట్టుకోవడం కష్టమవుతోందని బోర్డు భావిస్తోంది.

ఒకవేళ బెంగళూరులో ఈ సమస్య సర్దుమణగకపోతే, ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్ (నరేంద్ర మోదీ స్టేడియం) లేదా చెన్నైకి మార్చే అవకాశం ఉందని సమాచారం. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం తక్కువగా ఉండటం, అదే సమయంలో వీఐపీ టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సాధారణ అభిమానులకు టికెట్లు దొరకడం కష్టమవుతోంది.

Also Read:గోదారి గట్టుపైన..ఎంజాయ్ చేస్తారు!

బెంగళూరు అద్భుతమైన వేదిక, కానీ అక్కడ ప్రతి మ్యాచ్‌కు రాజకీయ నాయకుల నుండి వచ్చే టికెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్ సమయంలో ఈ ఒత్తిడిని భరించడం బోర్డుకు ఇబ్బందికరంగా మారుతోంది అని బీసీసీఐ ప్రతినిధి పేర్కొన్నారు.ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై, ఫైనల్ మ్యాచ్ వేదికపై తుది నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -