నేటి నుంచే ఐపీఎల్‌ ధమాకా..

203
IPL T20 Schedule 2018
- Advertisement -

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ మ్యాచ్‌లు వస్తున్నాయంటే దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉండే సందడి అంతాఇంతా కాదు. కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆరంభం అదిరిపోయేలా ఏర్పాట్లు చేసింది మేనేజ్ మెంట్.

తొలి మ్యాచే అభిమానుల్ని ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చెన్నై…డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో తలపడనుంది. మ్యాచ్‌కు రెండు గంటల ముందు నుంచే తారల తళుకులతో సాగే ఆరంభోత్సవం అదిరిపోనుంది. 51 రోజుల పాటు 8 జట్లు 9 నగరాల్లో ప్రేక్షకులను అలరించనున్నాయి. మొత్తంగా 60 మ్యాచ్‌ల మహా సంగ్రామంలో తొలి మ్యాచ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముంబయిని రెండుసార్లు విజేతగా నిలిపిన స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ సారథ్యంలోనే ముంబయి బరిలోకి దిగుతోంది. రోహిత్‌తో పాటు కృనాల్‌ పాండ్య, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, కమిన్స్‌, ముస్తాఫిజుర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మెక్లెనగన్‌, డుమిని లాంటి ఆటగాళ్లతో ముంబయి కూడా పటిష్టంగా ఉంది. ఈ రెండు బడా జట్ల మధ్య పోరుతో వాంఖడె స్టేడియంలో హోరెత్తిపోవడం ఖాయం.

ఐపీఎల్‌ ఆరంభం నుంచి సూపర్‌కింగ్స్‌ను నడిపిస్తూ వచ్చిన మహేంద్ర సింగ్‌ ధోని తిరిగి చెన్నై జట్టు పగ్గాలందుకున్నాడు. రైనా, జడేజా, డుప్లెసిస్‌, బ్రావో, మురళీ విజయ్‌ లాంటి పాత ఆటగాళ్లకు తోడు కొత్తగా ఆ జట్టులోకి వచ్చిన అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్‌, కేదార్‌ జాదవ్‌, షేన్‌ వాట్సన్‌ లాంటి ఆటగాళ్లతో చెన్నై అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

- Advertisement -