ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఈ నెల 29న రాజస్థాన్ రాయల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియంలో ఎలాంటి అవాంచ-నీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో ఇప్పటికే సీసీకెమెరాలు ఉండగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ను సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంకు వచ్చే అభిమానుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈసారి ఏడు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చి 29న రాజస్థా న్ రాయల్స్, 31నరాయల్ చాలెంజర్స్ బెంగుళూరు,ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్, 14న ఢిల్లీ క్యాపిటల్స్ తో-,17న చెన్నై సూపర్ కింగ్స్, 21న కోల్‌కతా నైట్‌రైడర్స్ , 29న కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లతో ఆరెంజ్ ఆర్మీతో తలపడనుంది.
సన్ రైజర్స్ జట్టుకు తాను బాహుబలినని తెలిపారు ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన వార్నర్ టోర్నీలో తన సత్తాచాటుతానని తెలిపాడు.