రైనా ఐపీఎల్ కెరియర్.. ముగిసినట్లేనా?

50
- Advertisement -

టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా ఐపీఎల్ కెరియర్ ముగిసినట్లేనా ? అంటే అవుననే సమాధానం క్రీడా వర్గాల నుంచి వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లు నమోదు చేసిన రైనా ‘చిన్నతళా’ గా పేరు గాంచాడు. అయితే తాజాగా జరిగిన 2024 ఐపీఎల్ వేలంలో రైనా అసలు ఎంపిక కాకపోవడం గమనార్హం. 2017లో వేలం లోకి వచ్చిన రైనాను రూ.12.5 కోట్లు పెట్టి గుజరాత్ సొంతం చేసుకుంది. కానీ ఆ సీజన్ లో రైనా పెద్దగా రాణించలేదు. ఇక అప్పటి నుంచి రైనా ఐపీఎల్ కెరియర్ మసకబారుతు వచ్చింది. ఇక సురేష్ రైనాతో పాటు మరికొంత మంది సీనియర్ ఐపీఎల్ ఆటగాళ్ళు కూడా ఈ సీజన్ లో ఎంపిక కాలేదు. వారిలో మురుగన్ అశ్విన్, కరుణ్ నాయర్, సర్ఫ్ రాజ్ వంటి వారు ఉన్నారు. .

ఇక ఇదిలా ఉంచితే నిన్న జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో మొత్తం 333 మంది ప్లేయర్స్ వేలంలో పాల్గొనగా 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు కలిసి ఎంచుకున్నాయి. వీరిలో 30 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇక గతంలో ఓ వెలుగు వెలిగిన విదేశీ ప్లేయర్స్ ఈసారి చాలమంది అమ్ముడుపోలేదు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు కాగా.. అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. అలాగే హెజిల్ వుడ్, ఇంగ్లీస్, మన్రో, హోల్డర్, జోర్డాన్ వంటి వారిని కూడా ఈ సీజన్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయి. ఇక ఈసారి విదేశీ ఆటగాళ్లలో మిచెల్ స్టార్క్ ను ( రూ.24.75 కోట్లు ) భారీ ధరతో కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పాట్ కమిన్స్ ( రూ.20.50 కోట్లు ) ను సన్ రైజర్స్ హైదరబాద్ సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాళ్లు గా నిలిచారు.

Also Read:IND VS SA:భారత్ పై విక్టరీ!

- Advertisement -