ఇప్పటివరకు స్వదేశంలో భారత్ ఎక్కడ ఆడినా ఆ మ్యాచ్‌లను దూరదర్శన్‌లో చూడగలిగాం. ఇకపై బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ మ్యాచ్‌లను కూడా దూరదర్శన్‌లు చూసే విధంగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ముందు ఓ ప్రపోజల్ పెట్టింది.
అంతేగాదు ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ కామెంట్రీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రసార భారతీ ఆధ్వర్యంలో దూరదర్శన్,ఆల్ ఇండియా రేడియో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం పంపించిన ఈ ప్రపొజల్‌కు స్టార్ స్పోర్ట్స్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
దీంతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ఓ గంట ముందుకు జరిపేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ మొదలై..అర్దరాత్రి వరకు జరుగుతుండటంతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులకే కాదు టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పుల ప్రతిపాదనను బీసీసీఐ స్టార్ స్పోర్ట్స్ ముందు పెట్టింది.దీనిపై కూడా స్టార్ స్పోర్ట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
యురోపియన్ ఫుట్‌బాల్ స్టెల్లో టోర్నీ మధ్యలో ప్లేయర్స్‌ను ఒక టీమ్ నుంచి మరో టీమ్ ట్రాన్స్‌ఫర్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది ఐపీఎల్. దీని ప్రకారం ఏడు మ్యాచుల్లో రెండు మ్యాచులే ఆడే అవకాశం వచ్చిన ఓ ప్లేయర్ మరో ఫ్రాంచైజీకి వెళ్లే చాన్స్ ఉంటుంది. దీనికి ఫ్రాంచైజీలు కూడా ఓకే చెప్పాయని చైర్మర్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ప్రారంభమయ్యే ఐపీఎల్ మరిన్ని హంగులతో ముందుకు వస్తుందనడంలో సందేహం లేదు.