ఐపిఎల్ 12 వ సీజన్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో జరుగుతుంది. ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ను చూసేందుకు చెన్నై, ముంబై నగరాల నుండి అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటి వరకూ ఐపిఎల్ చరిత్రలో చెన్నై, ముంబై జట్లు చేరో మూడు సార్లు టైటిల్ గెలిచాయి. ఇక నాలుగోసారి ఎవరూ టైటిల్ గెలచుకుంటారో చూడాలి.
ముంబయి: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, కీరన్‌పొలార్డ్, రాహుల్ చాహర్, మిచెల్ మెక్లెనగన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ
చెన్నై: డుప్లెసిస్, షేన్ వాట్సన్, సురేశ్‌రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌సింగ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్