ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత జట్టును ఇటీవలే విండీస్ టూర్‌కు జట్టును ప్రకటించారు. అయితే మాజీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయిన కూడా సెలెక్టర్లు యువ క్రికెటర్లైన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్‌కుమార్‌కు అవకాశం వచ్చింది. వీరంతా ఐపీఎల్లో రాణించడంతో జట్టులోకి వచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా టీమ్ఇండియా ఆటగాడు అభినవ్ ముకుంద్ కూడా ఇదే విషయంపై సెలక్షన్ కమిటీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరలవుతుంది.
విండీస్‌తో పర్యటనకు సెలక్షన్ విధానం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. నా మదిలోఆలోచనలను ట్వీట్ రూపంలో తీసుకోస్తున్నా అని మొదలు పెట్టారు. తన రాష్ట్రం కోసం ఆడిన యువ ఆటగాళ్లకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడటం వల్ల జాతీయ జట్టులోకి వేగంగా అవకాశం వస్తుందనేది స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ప్రస్తుతం దీనిపై నెట్టింట చర్చకు దారితీసింది. రుతరాజ్, యశస్వి టాలెంట్‌ను ఏమాత్రం తక్కువ చేయడం లేదని, కానీ డోమెస్టిక్ క్రికెట్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిని పక్కన పెట్టడం సరైంది కాదనే వాదనా ఉంది.
Also Read: టీమిండియా టెస్టు షెడ్యూల్ ఇదే…!
సర్ఫరాజ్, అభిమన్యు ఈశ్వరన్ వంటి వారు జాతీయ జట్టులో ఉత్తమ ప్రదర్శన ఇస్తున్న వారిని ఎందుకు సెలక్ట్ చేయడంలో తెలియడం లేదు. ఫిట్నెస్ లేకపోతే సెంచరీలు, వికెట్లు రంజీలో ఎలా సాధించగల్గుతున్నారు. ఐపీఎల్ ఆడిన వారికి అవకాశం ఇస్తే జాతీయ జట్టులో ఆడే ఆటగాళ్లకు ఎప్పుడు అవకాశం వస్తుంది.మొత్తమీద దేశవాళీ టోర్నీలో రాణించినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదనే వ్యాఖ్యలకు ఈ ట్వీట్ బలం చేకూరుస్తుంది. రంజీల్లో అత్యుత్తమ ఆటగాళ్ల ప్రదర్శన బాగున్నప్పుడు వారిని పరిగణలోకి తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదు. ఇలాగే కొనసాగితే భారత్‌లో భవిష్యత్‌లో టెస్ట్ క్రికెట్ క్రమంగా కనుమరుగువుతుందని ట్వీటర్లో పేర్కొన్నారు.
Also Read: Virat Kohli:సంపాదనెంతో తెలుసా?
https://drive.google.com/file/d/1t5mr18uMDodqPioP5KZskO8xWKvylfkD/view?usp=sharing