ఐపీఎల్‌ రద్దు.. త్వరలో బీసీసీఐ ప్రకటన..

494
ipl
- Advertisement -

దేశంలో కరోనా రోజురోజుకు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి వలన క్రికెట్ అభిమానులకు నిరాశే మిగలనుంది. ఇప్పటికే ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో ఉన్న ప్రమాదకర పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ నిర్వాహకులు ఐపీఎల్‌ 13వ సీజన్‌ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.

ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మాట్లాడుతూ… లీగ్‌పై చర్చించడానికి ఏ మీటింగ్‌ లేదని కరాకండీగా చెప్పేశారు. గతంలో ఏప్రిల్‌ 15 వరకు లీగ్‌ను వాయిదా వేసినప్పటికంటే ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయి. పక్కరాష్ట్రం వ్యక్తులు, వాహనాల్నే తమ రాష్ట్రాల్లోకి రానీయడం లేదు. విదేశీయులు వచ్చే విమానాల్ని రానిస్తారా? ఇంకా చెప్పాలంటే పగలు పప్పు, ఉప్పు కోసం, రాత్రయితే మందుల (మెడిసిన్‌) కోసమే రోడ్డుపై తిరిగే పరిస్థితి ఉంది.

అత్యవసర సేవల వాహనాలు కాకుండా ఏ వాహనమైనా కనిపిస్తే సీజ్‌ చేసే చట్టాన్ని అమల్లోకి తెచ్చాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఆటల్ని సాగనిచ్చే పరిస్థితే లేదు. కాబట్టి రద్దు తప్ప వాయిదాకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా చెబుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం వెల్లడించేందుకు ఇంకాస్త సమయం తీసుకుంటుంది. ఏప్రిల్‌లో ఐపీఎల్‌ రద్దు విషయం ప్రకటించనున్నట్లు సమాచారం.

- Advertisement -