ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రోజు ముగిసింది. వేలంలో తొలిరోజు సత్తాచాటారు భారత ఆటగాళ్లు. అత్యధికంగా పంత్ రూ.27 కోట్లు పలకగా శ్రేయస్ అయ్యర్ రూ.26.75, అర్షదీప్ సింగ్‌ను రూ.18 కోట్లు దక్కించుకున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను కొనుగోలు చేయగా పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను, వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.23.75 ,ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ రూ.11.25 కోట్లకు ,నటరాజన్‌ను ఢిల్లీ రూ.10.75 కోట్లకు ,అవేశ్ ఖాన్‌ను రూ.10.75 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
జోస్ బట్లర్ ను గుజరాత్ రూ.15.75 కోట్లు,కగిసో రబాడను గుజరాత్ రూ.10.75 కోట్లు, మిచెల్ స్టార్క్ ఢిల్లీ రూ.11.75 కోట్లు, మమ్మద్ షమీ సన్‌రైజర్స్ రూ.10 కోట్లు, డేవిడ్ మిల్లర్ లక్నో రూ.7.50 కోట్లు, చాహల్ పంజాబ్ రూ.18 కోట్లు,మహ్మద్ సిరాజ్ గుజరాత్ రూ.12.25 కోట్లు ధర పలికారు.
Also Read:Harishrao:సీఎం హోదాలో అబద్దాలా?