ఐపీఎల్-2018 వేలం ఆసక్తికరంగా సాగుతోంది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు ఐపీఎస్ ప్రాంఛైజీలు గట్టిషాకిచ్చాయి. గేల్‌ను కొనుగోలే చేసేందుకు ఏ ఒక్క ప్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇక గత ఏడాది ఐపీఎల్ వేలంలో రూ.14.5 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్ ఈ ఏడాది ఆ స్థాయి ధర పలకలేదు. రూ.12.5 కోట్లకే రాజస్థాన్ రాయల్స్ స్టోక్స్‌ను సొంతం చేసుకుంది.
భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ను దక్కించుకునేందుకు రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోటీపడ్డాయి. మధ్యలో ముంబయి ఇండియన్స్ కూడా పోటీలోకి వచ్చినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రైట్ టు మ్యాచ్ కార్డు అవకాశం ఉండటంతో అదే మొత్తంతో ధావన్‌ను తిరిగి సొంతం చేసుకుంది.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.7.6కోట్లతో దక్కించుకుంది. వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్‌ను రూ.5.4 కోట్లకు ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.9.40 కోట్లతో కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. రాజస్ధాన్ రాయల్స్ రూ.4 కోట్లతో అజింక్యా రహానేను దక్కించుకుంది. స్పిన్నర్ హర్బజన్‌ను రూ. 2 కోట్లతో చెన్నై దక్కించుకుంది. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్‌ను చెన్నై రూ.1.60 కోట్లతో దక్కించుకున్నాయి.