ఐపీఎల్ 2026 సీజన్‌కు గాను సీఎస్‌కే యువ ఆటగాళ్లపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. వేలంలో కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను ఒక్కొక్కరిని రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మతీశ పతిరానాను రిలీజ్ చేయడంతో డెత్ ఓవర్ల బౌలింగ్ లోపం ఇంకా పరిష్కారమవలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ప్రస్తుతం బీబీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న నాథన్ ఎలిస్‌తో ఆ సమస్య తీరినట్టేనని ఆ జట్టు మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు.
ఐపీఎల్ 2025లో కేవలం ఒకే మ్యాచ్ ఆడించినప్పటికీ సీఎస్‌కే ఎలిస్‌ను రిలీజ్ చేయలేదు. రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ఆయన, ఇప్పుడు హోబార్ట్ హరికేన్స్‌కు నాయకత్వం వహిస్తూ అదరగొడుతున్నారు. మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 3/30 గణాంకాలతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో 17, 20 ఓవర్లలో యార్కర్లు, వేరియేషన్లతో 2/15 తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ప్రదర్శనపై స్పందించిన అశ్విన్…యెల్లో జట్టుకు ఇది శుభవార్త. చిపాక్‌లో 2026 వేసవిలో డెత్ ఓవర్లలో ఎలిస్ రెండు ఓవర్లు ఫిక్స్ అనొచ్చు అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సీజన్‌లో ఎలిస్ ఐదు మ్యాచ్‌ల్లో ఏడుగు వికెట్లు తీసుకోగా, హరికేన్స్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

