ఐపీఎల్ 18వ సీజన్ నేటితో ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనుంది కేకేఈఆర్. ఇక ఐపీఎల్ హిస్టరీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు సార్లు ఫైనల్‌కి చేరినప్పటికీ, ఇప్పటికీ తమ తొలి టైటిల్‌ను సాధించలేకపోయింది.
ఈ సీజన్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన తొలి టైటిల్ కోసం మరోసారి ప్రయత్నించనుంది. గత 17 సీజన్లలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మొత్తం 34సార్లు ఒకదానితో ఒకటి తలపడాయి. అందులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 20 మ్యాచ్‌లు గెలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 14 విజయాలు మాత్రమే సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేకపోయింది. మూడు సార్లు ఫైనల్‌లో ఓటమి పాలైన ఈ జట్టు, ఈసారి చరిత్రను తిరగరాయాలనే కృతనిశ్చయంతో బరిలోకి దిగుతోంది.
Also Read:ట్రంప్ మరో సంచలన నిర్ణయం