IPL 2025లో భాగంగా ఫైనల్‌కి చేరింది ఆర్సీబీ. క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ 27 బంతుల్లో 56 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ అయింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30కి పైగా రన్స్ చేయలేకపోయారు. ఆ జట్టులో హయ్యస్ట్ స్కోరర్ స్టోయినిస్. అతడు 26 పరుగులు చేశాడు. పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
బెంగళూరు బౌలర్లు అంతా చెలరేగిపోయారు. సుయాశ్ శర్మ, హేజిల్ వుడ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ చెరో వికెట్ తీశారు. 9 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ పైనల్ కి దూసుకెళ్లడం విశేషం.
Also Read:రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం:సబితా

