IPL 2025 :బోణీ కొట్టిన బెంగళూరు..

1
- Advertisement -

ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాకు షాక్ ఇచ్చింది ఆర్సీబీ. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

175 పరుగుల టార్గెట్‌ను 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేయగా, ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే అర్ధ సెంచరీ (56) చేయగా, సునీల్ నరైన్ కూడా 44 పరుగులు చేశాడు. బెంగళూరు తరఫున కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా, జోష్ హాజిల్‌వుడ్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు బౌలర్ కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read:Retro:సూర్య ‘రెట్రో’ సాంగ్‌

- Advertisement -