ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మార్చి 22న తొలి మ్యాచ్ జరగనుండగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. ఇక ఐపీఎల్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ. ఎందుకంటే ఉహించని విజయాలు, పరాజయాలు, అద్భుతాలు వెరసీ క్రికెట్ లవర్స్‌కు కిక్ ఇచ్చే టోర్నీగా మారిపోయింది ఐపీఎల్.
ప్రపంచ దేశాల ఆటగాళ్లు లీగ్‌లో ఆడుతుండటంతో ఐపీఎల్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఐపీఎల్ లీగ్ విలువ అక్షరాలా 50 లక్షల కోట్లు. ఇక ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టు ముంబై ఇండియన్స్. అంబానీకి చెందిన ముంబై జట్టు విలువ 1.5 లక్షల కోట్లు. చెన్నై సూపర్ కింగ్స్ ముంబైకి పోటీగా ఉన్నా, వ్యాపార పరంగా చూస్తే ఇంకా వెనుకబడి ఉంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని లాంటి స్టార్ ప్లేయర్ల ప్రభావంతో మహిళలూ ఈ లీగ్‌ను ఆసక్తిగా చూడటం మొదలు పెట్టారు. టెస్ట్, వన్డేలు పెద్దగా చూడకపోయినా, ఐపీఎల్ కోసం మాత్రం బాగా క్యూరియాసిటీ పెరిగింది. ఇదే ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదపడింది.
Also Read:మెగాస్టార్‌కు ఘన సత్కారం