సన్‌రైజర్స్ సంచలన విజయం..

40
- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదుచేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.

హైదరాబాద్‌ నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్‌ జురెల్‌ 35 బంతుల్లో 56 నాటౌట్‌ ఒంటరిపోరాటం చేసినా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ ఓటమి తప్పలేదు.షాబాజ్‌ అహ్మద్‌ (3/23), అభిషేక్‌ శర్మ (2/24) స్పిన్‌ మాయాజాలం ముందు రాజస్థాన్ తలవంచకతప్పలేదు.

ఇక అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 9 వికెట్లు కొల్పోయి 175 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 34 బంతుల్లో 4 సిక్సర్లతో 50 పరుగులు చేయగా రాహుల్‌ త్రిపాఠి 15 బంతుల్లో 37 పరుగులు ధాటిగా ఆడారు. షాబాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

Also Read:6వ దశ ఎన్నికల పోలింగ్‌..అప్‌డేట్

- Advertisement -