IPL 2024:ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు అగేనా?

64
- Advertisement -

నేడు ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ సన్ రైజర్స్ తో గుజరాత్ టాటైన్స్ ఢీ కొట్టనుంది. ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనున్నాయి. రెండు మ్యాచ్ లు కూడా అభిమానులకు పూర్తి వినోదాన్ని పంచెవి కావడంతో ఈ మ్యాచ్ ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సన్ రైజర్స్ దూకుడు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ తో పదునైన పేస్ దళంతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తోంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ (277) నమోదు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కూడా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ అందరిని ఆకర్షించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసేన్, మర్క్రమ్.. వంటి వారు విధ్వంసకర బ్యాటింగ్ తో హడలెత్తిస్తున్నారు. బౌలింగ్ లో కాస్త మెరుగు పడితే ఎస్‌ఆర్‌హెచ్ కు తిరుగుండదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నేడు గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

చెన్నై జోరు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయలతో మంచి జోరు మీద ఉంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు రెండిట్లోను విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లోనూ ఆ జట్టు పటిష్టంగా ఉండడంతో తిరుగులేని ఆదిపత్యం కొనసాగిస్తోంది. ఇక నేడు జరిగే మ్యాచ్ లో డిల్లీ టైటైన్స్ తో తలపడనుండగా.. చెన్నై జోరుకు డిల్లీ ఎంతమేర అడ్డుకట్ట వేస్తుందనేది చూడాలి. డిల్లీ గత రెండు మ్యాచ్ లలోనూ ఓటమిపాలు అయింది. దాంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి తీరాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది.

ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయం సాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్య చేధనలో పంజాబ్ 178 పరుగులు మాత్రమే చేయడంతో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read:మీకు తెలుసా.. కారంతోనే ఆరోగ్యం!

- Advertisement -